![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -404 లో....కృష్ణ, రేవతి ఇద్దరు హాల్లో కూర్చొని మురారి ఇంకా రాలేదని వెయిట్ చేస్తుంటే.. అపుడే ముకుంద వస్తుంది. మురారి ఏమైనా కన్పించాడా అని ముకందని కృష్ణ అడుగుతుంది. లేదు నేను ఇక్కడ దగ్గరలో వాకింగ్ చేసి వస్తున్నానని ముకుంద చెప్తుంది. ఇదిగో కాఫీ ఏసీపీ సర్ కోసం చేసాను. సర్ రాలేదు కదా నువ్వు తీసుకొ అని కృష్ణ అనగానే.. మురారి కోసం చేసిన కాఫీ ఇస్తున్నావ్? మురారిని ఎప్పుడు ఇస్తావని ముకుంద తన మనసులో అనుకుంటుంది. మురారికి నిజం చెప్పి.. నా బాధని తీర్చుకున్నాను. ఇక అంతా మురారి చూసుకుంటాడని ముకుంద మనసులో హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మరొకవైపు ముకుంద అన్న మాటలనే మురారి గుర్తుకు చేసుకుంటాడు. ముకుంద మారిపోయిందని కృష్ణ చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు తనకి మారలేదని తెలిస్తే తట్టుకోలేదు. ఈ విషయం కృష్ణకి తెలియకూడదు. ఎవరికి అయిన చెప్దామంటే ముకుంద బ్లాక్ మెయిల్ చేస్తుందని మురారి తనలో తానే బాధపడుతుంటాడు. ఆ తర్వాత ముకుంద దగ్గరికి ఆదర్శ్ వస్తాడు. అపుడే కృష్ణ కాఫీ తీసుకొని వచ్చి వాళ్లకి ఇచ్చి షేర్ చేసుకోమని ఇస్తుంది ఆదర్శ్ తాగింది నేను తాగాలా నెవెర్ అని అనుకుంటుంది. కానీ ఆదర్శ్ తను తాగకుండా కప్ లో కొంచెం సాసర్ లో కొంచెం ఇవ్వగానే ముకుంద హ్యాపీగా తీసుకొని తాగుతుంది. ఏంటి ముకుంద ఇష్టంగానే తీసుకుంది. ఆదర్శ్ అంటే ఇష్టం ఉందా? లేక నేనే తనని తప్పుగా అర్థం చేసుకున్నానా అని కృష్ణ అనుకుంటుంది.
ఆ తర్వాత ఆదర్శ్ తన ఫ్రెండ్ తో ఫోన్ మాట్లాడుతుంటాడు. నేను మూడు రోజులు బయటకు వెళ్ళను. ఎందుకంటే నాకు శోభనమని ఆదర్శ్ తన ఫ్రెండ్ కి చెప్పడం రేవతి వింటుంది. ముకందపై ఆదర్శ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు.. ఈ మధు ఏమో అసలు ముకుంద మారలేదని అంటున్నాడని రేవతి అనుకుంటుంది. ఆదర్శ్ ఫోన్ మాట్లాడడం మురారి కూడా వింటాడు. ఎలాగైనా ముకుంద మనసు మార్చి నీకు దగ్గర చేస్తానని ఆదర్శ్ గురించి మురారి తన మనసులో అనుకుంటుంటాడు. ఆ తర్వాత ముకంద తన ప్రేమ గురించి ఆలోచిస్తుంటుంది. అప్పుడే ఆదర్శ్ వచ్చి శోభనమని హ్యాపీగా ముకుందతో మాట్లాడతాడు. మరొకవైపు అసలు ఏం చేయాలని మురారి టెన్షన్ పడతాడు. తరువాయి భాగంలో ఆదర్శ్ ని పంపించే ప్రయత్నం ఎక్కడ వరకు వచ్చింది? మనమిద్దరం ఒకటి అవ్వాలంటూ మురారితో ముకుంద మాట్లాడడం కృష్ణ విని షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |